*ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు*
*పేదల సంక్షేమమే ఇందిరమ్మకు నిజమైన నివాళి :- గరిసెల సురేందర్ ముదిరాజ్*
మేడ్చల్:- గుండ్ల పోచంపల్లి డివిజన్ పరిధిలోని భారతదేశ మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ, పేదల పెన్నిధి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా గుండ్ల పోచంపల్లి డివిజన్ పరిధిలో ఘనంగా నివాళులర్పించారు. గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి, మాజీ సర్పంచ్ గరిసెల సురేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గరిసెల సురేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి, పేదల సం
క్షేమానికి ఇందిరా గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆమె చూపిన మార్గంలో పయనిస్తూ, పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని తెలిపారు. అదేవిధంగా గౌడవల్లి శివాజీ చౌరస్తాలో ఇందిరా గాంధీ విగ్రహానికి రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యురాలు గోగుల సరిత, గరిసెల సురేందర్ ముదిరాజ్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో మాజీ సర్పంచులు బండారి నరేందర్ ముదిరాజ్, బేరి ఈశ్వర్, మాజీ కోఆప్షన్ సభ్యులు డి. గోపాల్, డివిజన్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బొజ్జ ఆదిలక్ష్మి, జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యదర్శి మరిలమ్మ, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరంగవరం నవీన్ ముదిరాజ్, కండ్లకోయ మాజీ ఉపసర్పంచ్ చిల్ల వెంకటేష్ ముదిరాజ్, జిల్లా ఓబీసీ నాయకులు సాయిపేట సురేష్, ఎన్టియుసి జిల్లా మాజీ అధ్యక్షుడు కావేరి శేఖర్ ముదిరాజ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సాయి ముదిరాజ్, మాజీ ఎంపీటీసీ పులిగిల్ల రాజేశ్వర్, హరిశంకర్, ఎల్. వినోద్ గౌడ్, గువ్వ శ్రీనివాస్, ప్రదీప్ ముదిరాజ్, అమరం సురేష్ రెడ్డి, దొడ్ల మోహన్ ముదిరాజ్, పూజారి వేణుగోపాల్, వీరస్వామి, సత్తారి వెంకటేష్ ముదిరాజ్, కృష్ణారెడ్డి, నాగభూషణం చారి తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇందిరా గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజాసేవలో ముందుకు సాగుతామని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

