ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

*ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు* *పేదల సంక్షేమమే ఇందిరమ్మకు నిజమైన నివాళి :- గరిసెల సురేందర్ ముదిరాజ్* మేడ్చల్:- గుండ్ల పోచంపల్లి డివిజన్ పరిధిలోని భారతదేశ మాజీ ప్రధానమంత్రి, ఉక్కు మహిళ, పేదల పెన్నిధి స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా గుండ్ల పోచంపల్లి డివిజన్ పరిధిలో ఘనంగా నివాళులర్పించారు. గుండ్ల పోచంపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర సర్పంచుల ఫోరం మాజీ అధికార ప్రతినిధి, మాజీ సర్పంచ్ గరిసెల సురేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో...