నూతన జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ కు పాత్రికేయుల ఘన సన్మానం
ప్రజావాణి,వికారాబాద్ జిల్లా న్యూస్,,
నూతన జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన కొత్తపల్లి శ్రీధర్ తొలిసారిగా కోడంగల్ విచ్చేసిన సందర్బంగా స్థానిక పత్రికేయ మిత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు రాష్ట్ర గ్రామీణ విలేకారుల సంక్షేమ సంఘం కమిటీ సభ్యుడు శ్రీనివాస్ చారి, జిల్లా అక్రిడేషన్ కమిటీ సభ్యుడు రఘు, జిల్లా యూనియన్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కిషన్ రావులను కూడా పాత్రికేయులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పాత్రికేయుల ఐక్యత జర్నలిస్టుల సంక్షేమం వృత్తిపరమైన. సమస్యల పరిష్కారానికి,సంఘాలు సమష్టిగా కృషి చేయాలని పలువురు ఆకాంక్షించారు. నూతన జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీధర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు పీకిరప్ప,సీనియర్ జర్నలిస్టులు ప్రభాకర్, పృథ్వీరాజు,శ్రీకాంత్,నరేష్,ప్రసాద్,అబిద్, నరేందర్ తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.

