📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఅశ్వారావుపేట నుంచి సత్తుపల్లికి అక్రమంగా తరలిస్తున్న 5 టన్నుల కలప పట్టివేత

అశ్వారావుపేట నుంచి సత్తుపల్లికి అక్రమంగా తరలిస్తున్న 5 టన్నుల కలప పట్టివేత

📰 Generate e-Paper Clip

*అశ్వారావుపేట నుంచి సత్తుపల్లికి అక్రమంగా తరలిస్తున్న 5 టన్నుల కలప పట్టివేత*

ప్రజావాణి భద్రాద్రి జిల్లా ప్రతినిధి నవంబర్ 19

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం అటవీ శాఖ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భాగంగా, అశ్వారావుపేట నుంచి సత్తుపల్లి వైపు ట్రాక్టర్‌లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 5 టన్నుల కలపను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న కలప విలువ సుమారు రూ.24,375/- గా అంచనా వేయబడింది.ఈ ఘటనకు సంబంధించి ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకొని, బాధ్యులపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. దమ్మపేట రేంజర్ మాట్లాడుతూ,అటవీ సంపదను అక్రమంగా రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ అధికారులు హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.