📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణసీఎం పర్యటన వేళ బెజ్జంకిలో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం నేతల ముందస్తు అరెస్టులు

సీఎం పర్యటన వేళ బెజ్జంకిలో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం నేతల ముందస్తు అరెస్టులు

📰 Generate e-Paper Clip

సీఎం పర్యటన వేళ బెజ్జంకిలో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం నేతల ముందస్తు అరెస్టులు

తెల్లవారుజామునే పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

బెజ్జంకి, నవంబర్ 19 (ప్రజావాణి)

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా పర్యటన నేపథ్యంలో బెజ్జంకి మండలంలో ముందస్తు అరెస్టులు చోటుచేసుకున్నాయి. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసనలు, ఆందోళనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమై గురువారం తెల్లవారుజామునే పలువురు అఖిలపక్ష నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేటలో నిర్వహించే సీఎం బహిరంగ సభకు వెళ్లకుండా బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బెజ్జంకి మండలంలో నిలిచిపోయిన రోడ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని, మండల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంతో పాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను తక్షణమే పూర్తి చేయాలని కోరారు. ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేయడం సరికాదని పేర్కొన్నారు.
ముందస్తు అరెస్టయిన వారిలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్, శ్రీనివాస్ గుప్తా, బీజేపీ మండల అధ్యక్షుడు కొలిపాక రాజు, సీపీఐ మండల సహాయ కార్యదర్శి సంగెం మధు, సీపీఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్,నాలువాల స్వామి, సోషల్ మీడియా ఇన్‌చార్జి ఏల శేఖర్ బాబు తదితరులు ఉన్నారు. వీరిని పోలీసులు బెజ్జంకి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.