సీఎం పర్యటన వేళ బెజ్జంకిలో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం నేతల ముందస్తు అరెస్టులు

సీఎం పర్యటన వేళ బెజ్జంకిలో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం నేతల ముందస్తు అరెస్టులు తెల్లవారుజామునే పలువురు నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు బెజ్జంకి, నవంబర్ 19 (ప్రజావాణి) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా పర్యటన నేపథ్యంలో బెజ్జంకి మండలంలో ముందస్తు అరెస్టులు చోటుచేసుకున్నాయి. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి నిరసనలు, ఆందోళనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమై గురువారం తెల్లవారుజామునే పలువురు అఖిలపక్ష నాయకులను అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేటలో నిర్వహించే సీఎం బహిరంగ సభకు వెళ్లకుండా బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం...