📄 ePaper
5pm
7pm
Thursday, November 19, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణహంగర్గ ఫారంలో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్.

హంగర్గ ఫారంలో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్.

📰 Generate e-Paper Clip

హంగర్గ ఫారంలో ఘనంగా వాలీబాల్ టోర్నమెంట్.

యువతలో క్రీడా స్ఫూర్తికి నిషా డెకరేషన్ ప్రోత్సాహం.

నాలుగు మండలాల యువకులతో హంగర్గ ఫారంలో హోరాహోరీ వాలీబాల్ పోటీలు.

వాలీబాల్ ఫైనల్‌లో ఆసిఫ్ స్టార్ జట్టు విజయకేతనం.

క్రీడలతో యువతలో సోదరభావం పెంపొందించాలి.

సర్పంచ్లు రజియా బేగం (ఫెరోజ్),నరహరి సునీల్.

కోటగిరి/ప్రజావాణి:-గ్రామీణ ప్రాంత యువకులలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడంతో పాటు,యువకుల మధ్య సోదరభావాన్ని పెంచే లక్ష్యంతో నిషా డెకరేషన్ సౌజన్యంతో నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని పోతంగల్ మండలం హంగర్గ ఫారం గ్రామంలో గత రెండు రోజులుగా వాలీబాల్ టోర్నమెంట్ ను నైట్ సమయంలో విద్యుత్ కాంతుల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ పోటీల్లో కోటగిరి,పోతంగల్,రుద్రూర్, బీర్కూర్ మండలాలకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో టీముల వారిగా ఉత్సాహంగా పాల్గొన్నారు.రెండు రోజుల పాటు కొనసాగిన ఈటోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ మంగళవారం ఉత్కంఠ భరితంగా సాగింది.ఫైనల్‌లో ఆసిఫ్ స్టార్ టీమ్,షారుక్ టీమ్ తలపడగా ఆసిఫ్ స్టార్ టీమ్ విజేతగా నిలిచింది.విజేత జట్టుకు రూ.10 వేల నగదు బహుమతి తో పాటు ట్రోఫీ,రన్నరప్ జట్టుకు రూ.5 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేశారు.ఈ సందర్భంగా హంగర్గ గ్రామ సర్పంచ్,నిషా డెకరేషన్ కరస్పాండెంట్ రజియా బేగం (ఫెరోజ్), కారేగాం సర్పంచ్ నరహరి సునీల్ మాట్లాడుతూ.గ్రామీణ ప్రాంత యువకు ల్లో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించేందుకు ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.క్రీడల ద్వారా యువత శారీరక దృఢత్వంతో పాటు క్రీడా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు.వివిధ మండలాల యువకులు ఒకే వేదికపై పోటీపడటం వల్ల పరస్పర పరిచయాలు, సోదర భావంపెంపొందుతాయని పేర్కొన్నారు.టోర్నమెంట్ విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కారేగాం సర్పంచ్ నరహరి సునీల్,హంగర్గ ఫారం గ్రామ ఉపసర్పంచ్ షేక్ గౌస్ పాషా, పోతంగల్ మండల కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు చాంద్ పాషా, వార్డు సభ్యులు బాబురావు,షాదుల్, మహబూబ్,టోర్నమెంట్ నిర్వాహకులు ఖలీద్,ఇస్మాయిల్ పటేల్,ఇఫ్తేకార్, జలీల్,జమీర్,గ్రామ పెద్దలు,వాలీబాల్ క్రీడాకారులు,యువకులు,గ్రామస్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.