📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణశ్రావణ్ పల్లి, ఎల్లందు బొగ్గు గనులు సింగరేణికే దక్కాలి

శ్రావణ్ పల్లి, ఎల్లందు బొగ్గు గనులు సింగరేణికే దక్కాలి

📰 Generate e-Paper Clip

*శ్రావణ్ పల్లి, ఎల్లందు బొగ్గు గనులు సింగరేణికే దక్కాలి*

*ఏఐటీయూసీ ఆద్వర్యంలో రాస్తారోకో, ధర్నా*

* *మన ప్రజావాణి మందమర్రి:-*

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అంటూ ప్రగల్భాలు పలికే కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిపై తన చిత్తశుద్ధిని చాటి, బొగ్గు బ్లాక్ ల వేలం ప్రక్రియలో రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి సింగరేణికి సింగరేణి పరిధిలోని శ్రావణ్ పల్లి ఓసిపి, ఎల్లందు ఓసిపి 3 బొగ్గు గనులు దక్కే విధంగా సహకరించాలని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ, బ్రాంచ్ ఉపాధ్యక్షుడు భీమనాథుని సుదర్శన్ లు డిమాండ్ చేశారు. ఈమేరకు యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట గల కోల్ బెల్ట్ రహదారిపై రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా సత్యనారాయణ సుదర్శన్ లు మాట్లాడుతూ, ఏరియాలోని శ్రావణ్ పల్లి ఓసి, ఎల్లందు లోని ఓసి 3 గనులు సింగరేణికే దక్కెలా, సింగరేణి యాజమాన్యం ఆ టెండర్ లో పాల్గొని, గనులను సింగరేణికే కేటాయించే విధంగా యాజమాన్యానికి ప్రభుత్వం
సహకరించాలని కోరారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకుల అసమర్ధతతో సింగరేణి యాజమాన్యం బొగ్గు గల వేలం పాటలో పాల్గొనకుండా చేయడంతో పాటు పార్లమెంట్ లో ఎంఎండిఆర్ చట్టానికి కేంద్ర ప్రభుత్వానికి వత్తాసు పలికి, బొగ్గు గనులను సింగరేణికి రాకుండా చేసి, గనులను బిఆర్ఎస్ ప్రభుత్వం తన అనుకూల వ్యక్తులకు కట్టబెట్టి, సింగరేణిని నిర్వీర్యం చేసి, రాజకీయ జోక్యంతో ఆర్థిక దోపిడీ చేసి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఇటీవల జరిగినటువంటి చర్చలలో 30 డిమాండ్లతో ఆర్ఎల్సి సమక్షంలో యాజమాన్యంతో ఒప్పుకున్నటువంటి
24 డిమాండ్లను తక్షణమే ఉత్తర్వుల జారీ చేసి, ఒప్పందాలను అమలు చేయాలనే తదితర డిమాండ్లతో నవంబర్ 18,19న రెండు రోజుల నిరాహార దీక్షలను కార్మికులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం దిగివచ్చి, సమస్యలను పరిష్కారం చేయాలని, లేనియెడల సింగరేణిలో మెరుపు సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు. కొన్ని సంఘాలు ప్రభుత్వ సర్కారు సంఘాలను విమర్శించకుండా పోరాడే
ఎర్రజెండా యూనియన్ అయిన ఏఐటీయూసీ యూనియన్ ను విమర్శించడం హాస్యాస్పదమని, ఇప్పటికైనా వారికి దమ్ము ధైర్యం ఉంటే తాము చేసే పోరాటాలకు మద్దతు తెలిపి, పోరాటంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఏరియా నాయకులు ఎగేటి రాజేశ్వరరావు, ముల్కలపల్లి వెంకటేశ్వర్లు, టేకుమట్ల తిరుపతి, పెద్దపల్లి బానయ్య, రాజేష్ కుమార్ యాదవ్, జి సుదర్శన్ రెడ్డి, పిట్ కార్యదర్శులు గాండ్ల సంపత్, మర్రి కుమారస్వామి, సిహెచ్పి శర్మ, కలువల శ్రీనివాస్, పారిపెల్లి సంజీవ్ కుమార్,శెట్టి రాజేందర్, ఊరకొండ శ్రీకాంత్, వెంకటేశ్వర్లు, రామ్ రెడ్డి, ప్రేమ్ లాల్, ఏరియాలోని అన్ని గనుల, విభాగాల సేఫ్టీ,మైన్ కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.