ఎల్కతుర్తి మండలంలో చేయూత పెన్షన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన మంత్రులు.
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
ఎల్కతుర్తి మండలంలో 715 మందికి నూతన చేయూత పెన్షన్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించారు.అందులో లబ్ధిదారులు నదునూరి రాజమణి,శ్రీపతి విజయ్,
మహిళా సంక్షేమశాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణశాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారు మహిళా సాధికారితా పేదల సంక్షేమ గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ ప్రజల ఆంక్షకు అనుకూలంగా ప్రభుత్వం ముందుకు సాగుతుంది.పేదల ముఖంలో చిరునవ్వు చూడాలని సంకల్పంతో ప్రజాసేవ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రజాపాలన ప్రభుత్వం.ఈ కార్యక్రమంలో
ఎంపీడీఓ విజయ్ కుమార్,మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజి,
సొసైటీ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్,సర్పంచ్ పురం అధ్యక్షులు శ్రీధర్ రావు సర్పంచ్ మాట్ల లింగయ్య,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అంబాల శ్రీకాంత్,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల చైతన్య కుమార్,
యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా జనరల్ సెక్రటరీ మండ సుమన్,పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

