📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణకస్తూర్బా గాంధీ పాఠశాలలో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి.

కస్తూర్బా గాంధీ పాఠశాలలో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి.

📰 Generate e-Paper Clip

కస్తూర్బా గాంధీ పాఠశాలలో సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి.

బీజేవైఎం రాష్ట్ర నాయకులు సోగాల మనోజ్ కుమార్

మద్దూరు నవంబర్16, ప్రజా వాణి,

మద్దూరు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చూపాలని కోరుతూ బి జె వై ఎం రాష్ట్ర నాయకులు మనోజ్ కుమార్ ప్రజావాణిలో దరఖాస్తు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కస్తూర్బా పాఠశాలలో కొద్ది రోజుల క్రితం కలుషిత నీరు వల్ల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం కిందిస్థాయి నుండి పై స్థాయి అధికారుల వరకు తెలుసు అయినా కూడా దానికి శాశ్వత పరిష్కారం చూపకుండా తూతూ మంత్రంగా చేతులు దులుపుకొని సమస్యలను గాలికి వదిలేశారనీ అన్నారు. మండలంలోని అధికారులు ప్రజాప్రతినిధులు సాక్షాత్తు ప్రభుత్వ కార్యాలయాలకు పక్కనే ఉన్న పాఠశాల విద్యార్థుల సమస్యను ప్రత్యక్షంగా చూసి కూడా నిర్లక్ష్యంగా చూసి చూడనట్టు గాలికి వదిలేసి పరిష్కరించకపోతే మండలంలోని ఉన్న సమస్యలకు ఎలా పరిష్కారం చూపుతారనీ అన్నారు. ఇప్పటికీ ఐన విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడకుండా కలుషిత నీరు బయటకు వెళ్లేలా శాశ్వత పరిష్కారం చూపి విద్యార్థులకు నాణ్యమైన భోజనం విద్యా అందించాలని ఆయన అన్నారు. లేని పక్షములో విద్యార్థులతో కలిసి బి జె వై ఎం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బి జె వై ఎంమండల అధ్యక్షులు అల్దే శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.