📄 ePaper
Epaper 2
Monday, November 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా భారతదేశం ఎంపీ ఈటల రాజేందర్

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా భారతదేశం ఎంపీ ఈటల రాజేందర్

📰 Generate e-Paper Clip

*అత్వెల్లి లో ఘనంగా ఛత్ పూజ వేడుకలు*

*భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా భారతదేశం మేడ్చల్- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్*

మేడ్చల్: సూర్య భగవానుడిని ఆరాధిస్తూ ఉత్తరాది ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఛత్ పూజ వేడుకలు తెలంగాణలోనూ ఘనంగా జరుగుతుండటం ఆనందదాయకమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలతో కూడిన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. మేడ్చల్ పరిధిలోని అత్వెల్లి చెరువులో నిర్వహిస్తున్న ఛత్ పూజా కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. బీహార్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు దూరంగా ఉన్నప్పటికీ, హైదరాబాద్‌లో స్థానిక కమిటీలు అద్భుతమైన ఏర్పాట్లు చేసి ఉత్తరాది సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావడం అభినందనీయమన్నారు. దీపావళి అనంతరం పంట చేతికొచ్చే శుభ సమయంలో భక్తులు అత్యంత నిష్టతో మూడు రోజుల పాటు ఛత్ పూజను నిర్వహించడం విశిష్టమైన సంప్రదాయమని తెలిపారు.

*కాస్మోపాలిటన్ నగరంగా హైదరాబాద్*

ఒకప్పుడు తెలంగాణ ప్రజలకు ఛత్ పూజ గురించి పెద్దగా తెలియదని, అయితే దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలను ఆదరించే కాస్మోపాలిటన్ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి చెందడంతో ఈ పండుగ విశిష్టత స్థానికులకు కూడా చేరువైందని ఈటల రాజేందర్ అన్నారు. ప్రస్తుతం ఫాక్స్ సాగర్, శామీర్‌పేట్, మల్లంపేట్, ఆల్విన్ నగర్ తదితర ప్రాంతాల్లో ఛత్ పూజ కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

*వచ్చే ఏడాదికి కొత్త ఘాట్ నిర్మాణం*

గత ఏడాది భక్తుల విజ్ఞప్తి మేరకు ఘాట్ నిర్మాణం కోసం రూ.16 లక్షలు మంజూరు చేసినట్లు ఎంపీ తెలిపారు. కాంట్రాక్టర్‌కు సంబంధించిన కొన్ని న్యాయపరమైన సమస్యల కారణంగా పనులు తాత్కాలికంగా నిలిచిపోయాయని, ఆ సమస్యలను త్వరలో పరిష్కరించి వచ్చే ఏడాది ఛత్ పూజ నాటికి కొత్త ఘాట్‌ను భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు.

*ప్రపంచ దేశాలకు ఆదర్శంగా భారతదేశం”

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్‌లోని కచ్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎన్నో భిన్న సంస్కృతులు, ఆచార సంప్రదాయాలు ఉన్నప్పటికీ అందరూ కలిసిమెలిసి జీవించడమే భారతదేశ గొప్పతనమని ఈటల రాజేందర్ కొనియాడారు.
140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. దేశంలోని విభిన్న వర్గాలు, భాషలు, సంస్కృతుల ప్రజలు పరస్పర గౌరవంతో కలిసి జీవించడం మన దేశ ప్రత్యేకత అని తెలిపారు. ‘సర్వేజనా సుఖినోభవంతు’ అనే విశ్వకళ్యాణ భావన, మన సంప్రదాయాలు దేశ ప్రజలను ఐక్యంగా ఉంచుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు నందా రెడ్డి, మేడ్చల్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, మేడ్చల్ అధ్యక్షురాలు శైలజ హరినాథ్, ప్రధాన కార్యదర్శి వంశీ విజయ్‌తో పాటు రాజేష్ చతుర్వేది, శ్రీకాంత్ పాండే, కపిల్ సింగ్, దినేష్ రజత్, సుజిత్ సింగ్, సంతోష్ పాండే, శివాని చతుర్వేది, సుశీల్ తివారీ, సునీల్ పాండే, కృష్ణ చతుర్వేది, చుల్‌బుల్ పాండే, శేఖర్ ఝా, రాజీవ్ చౌబే, వీడీ చౌబే, పప్పు పాండే తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.