భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా భారతదేశం ఎంపీ ఈటల రాజేందర్

*అత్వెల్లి లో ఘనంగా ఛత్ పూజ వేడుకలు* *భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా భారతదేశం మేడ్చల్- మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్* మేడ్చల్: సూర్య భగవానుడిని ఆరాధిస్తూ ఉత్తరాది ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఛత్ పూజ వేడుకలు తెలంగాణలోనూ ఘనంగా జరుగుతుండటం ఆనందదాయకమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలతో కూడిన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. మేడ్చల్ పరిధిలోని అత్వెల్లి చెరువులో నిర్వహిస్తున్న ఛత్ పూజా కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్ ముఖ్య...