📄 ePaper
Epaper 2
Monday, November 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఏఐకేఎస్36వ జాతీయ మహాసభలకు బయలుదేరిన జమ్మికుంట రైతాంగం కార్మిక వర్గం

ఏఐకేఎస్36వ జాతీయ మహాసభలకు బయలుదేరిన జమ్మికుంట రైతాంగం కార్మిక వర్గం

📰 Generate e-Paper Clip

ఏఐకేఎస్36వ జాతీయ మహాసభలకు బయలుదేరిన జమ్మికుంట రైతాంగం కార్మిక వర్గం

* రైతాంగ పోరాటాలకు భవిష్యత్తు కార్యాచరణ దిశానిర్దేశం చేయనున్న జాతీయ మహాసభలు: చెల్పూరి రాము

* సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ రైతు సంఘం జిల్లా నాయకులు

జమ్మికుంటనవంబర్ 14 (ప్రజావాణి)

అఖిల భారత రైతు సంఘం (ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభల సందర్భంగా భారీ బహిరంగ సభ విజయవంతనికై జమ్మికుంట నుంచి రైతాంగం కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో నల్లగొండకు బయలుదేరిందిఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు చెల్పూరి రాము మాట్లాడుతూ నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండ పట్టణంలో జరిగే 36వ జాతీయ మహాసభల్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 2,000 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలిపారుఈ మహాసభల్లో ఇప్పటివరకు నిర్వహించిన రైతాంగ పోరాటాలు, ఉద్యమ కార్యక్రమాలను సమీక్షించడంతో పాటు, దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్తులో చేపట్టాల్సిన రైతాంగ పోరాటాలకు దిశానిర్దేశం చేస్తూ కార్యాచరణ రూపొందిస్తారని అన్నారు రైతాంగ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారుజాతీయ మహాసభలను విజయవంతం చేయడానికి రైతులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారుఈ కార్యక్రమానికి రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బాచిర సంపత్ రావు, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్, రైతు సంఘం జిల్లా నాయకులు, శీలం అశోక్, కైత లింగారెడ్డి, కెవిపిఎస్ జిల్లా సహాయా కార్యదర్శి వడ్లురి కిషోర్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కదిరె రమేష్, నాయకులు కొంకట చంద్రయ్య ప్రతాప శ్రీనివాస్, బండ సురేష్, మొరే మహేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.