📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅగ్ని ప్రమాదబాధిత కుటుంబాన్ని ఆదుకున్న ఏబి ఫౌండేషన్

అగ్ని ప్రమాదబాధిత కుటుంబాన్ని ఆదుకున్న ఏబి ఫౌండేషన్

📰 Generate e-Paper Clip

అగ్ని ప్రమాదబాధిత కుటుంబాన్ని ఆదుకున్న ఏబి ఫౌండేషన్

ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం నవంబర్ 13

పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం చినార్కూర్ పంచాయితీ పండ్రాజుపల్లి అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఏబీ ఫౌండేషన్ తక్షణ ఆపన్నహస్తం!సర్వం కోల్పోయిన బొడ్డు వీరయ్య కుటుంబానికి అండగా నిలిచిన ఏబి ఫౌండేషన్..25 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు, దుస్తులు, వంట సామగ్రి పంపిణీ..అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఏబీ ఫౌండేషన్ పూర్తి భరోసా..ముఖ్య అతిథులుగా స్థానిక ఎంపీటీసీ సోడే రమా దేవి ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఏబీ ఫౌండేషన్ నిరంతరం ప్రజాసేవలో నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంది.ఏబి ఫౌండేషన్ చైర్మన్ కుంజా అనిల్ ఆధ్వర్యంలో కూనవరం మండలం చినార్కూర్ పంచాయతీ, పండ్రాజుపల్లి గ్రామస్తుడైనా బొడ్డు.వీరయ్య ఇల్లు కరెంట్ షాట్ సర్క్యూట్వల్ల పూర్తిగా దగ్ధమై ఇంట్లోని సామగ్రి అంతా కాలిబూడిదైంది. ఈ విషయం తెలుసుకున్న ఏబీ ఫౌండేషన్ చైర్మన్ అనిల్ బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు ముందుకొచ్చి,తన టీమ్ తో స్థానిక జనసేన ఎంపీటీసీ సోడే రమాదేవి ని ముఖ్య అతిథిగా పిలిచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి 25 కేజీల బియ్యం, కూరగాయలు, పండ్లు, దుప్పట్లు, వంట పాత్రలు సుమారు 3000 రూపాయల విలువుగల నిత్యావసర వస్తువులను తన చేతుల మీదుగా పంపిణీ చేశారు.
కష్టకాలంలో ఉన్న కుటుంబానికి తక్షణ అవసరాలను గుర్తించి సహాయం అందించడం ద్వారా ఫౌండేషన్ తన సేవా దృక్పథాన్ని చాటుకుంది. పేదల ఆకలి తీర్చడం, ఆపదలో ఉన్న నిరుపేదలకు అండగా నిలవడం ఏబీ ఫౌండేషన్ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా అనిల్ పేర్కొన్నారు.
అగ్నిప్రమాదంతో సర్వం కోల్పోయిన తమ కుటుంబానికి కష్ట సమయంలో అండగా నిలిచి నిత్యావసర వస్తువులు అందించిన ఏబీ ఫౌండేషన్‌కు బొడ్డు వీరయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సోడే ముత్తయ్య, అధ్యక్షులు కొమ్మరాజు. కిరణ్ బాబు, మచ్చ వినయ్ ప్రసాద్, సోడే, రామకృష్ణ, కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.