📄 ePaper
Epaper 2
Saturday, November 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణ36వ అఖిల భారత కిసాన్ మహాసభలను విజయవంతం చేయాలి

36వ అఖిల భారత కిసాన్ మహాసభలను విజయవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

36వ అఖిల భారత కిసాన్ మహాసభలను విజయవంతం చేయాలి

ప్రజా వాణి రిపోర్టర్ నరసింహులపేట్ నవంబర్ 13 : నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రజాసంఘాల నాయకుల పిలుపు నల్లగొండలో నవంబర్ 15, 16, 17, 18 తేదీలలో నిర్వహించనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని నర్సింహులపేట మండల కేంద్రంలోని ప్రజాసంఘాల నాయకులు మందుల యాకూబ్, బానోతు సర్వన్ , కందుకూరి సుధాకర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వ్యవసాయ రంగం సంక్షోభం, పంటలకు గిట్టుబాటు ధరలు, రైతుల హక్కులు, వ్యవసాయ కార్మికుల సమస్యలపై చర్చించేందుకు ఈ జాతీయ మహాసభలు ఒక ముఖ్యమైన వేదికగా నిలుస్తాయని తెలిపారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతాంగ హక్కుల సాధన కోసం జరిగే ఈ మహాసభలకు రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజాస్వామికవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో
మందుల యాకూబ్బానోతు సర్వన్
కందుకూరి సుధాకర్, రైతులు ఎల్లయ్య వెంకన్న వీరయ్య మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.