ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలోని గౌడ సంఘం అభివృద్ధికి పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శుక్రవారం రూ.10 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేశారు. సంఘం నాయకుల విజ్ఞప్తి మేరకు గ్రామాన్ని సందర్శించిన ఆయన, కమ్యూనిటీ భవనానికి ప్రహరీ గోడ నిర్మాణం, ఫంక్షన్ హాల్ అభివృద్ధి కోసం ఈ నిధులను కేటాయిస్తూ మంజూరు పత్రాన్ని అందజేశారు. భవిష్యత్తులోనూ గౌడ కులస్తుల సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇవ్వడంతో సంఘం సభ్యులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.
గౌడ సంఘం అభివృద్ధికి ఎంపీ రూ.10 లక్షల నిధులు మంజూరు
0
8
Previous article


