📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవంగపల్లి మాల సంఘం ప్రధాన పెద్దమనిషిగా పెరుమండ్ల సతీష్ ఏకగ్రీవ ఎన్నిక

వంగపల్లి మాల సంఘం ప్రధాన పెద్దమనిషిగా పెరుమండ్ల సతీష్ ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

వంగపల్లి మాల సంఘం ప్రధాన పెద్దమనిషిగా పెరుమండ్ల సతీష్ ఏకగ్రీవ ఎన్నిక

ప్రజావాణి నవంబర్ 13: కమలాపూర్ మండలం వంగపల్లి గ్రామంలో ఎస్సీ (మాల) సామాజిక వర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సామాజిక ఐక్యత, అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై చర్చించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ప్రధాన పెద్దమనిషిగా పెరుమండ్ల సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వర్గ పెద్దమనుషులుగా పెరుమండ్ల రఘుపతి కోండ్ర నరేందర్ గూడెపు రమేష్ ఎన్నికయ్యారు.

నూతన కమిటీ పదవీకాలం రెండేళ్లపాటు కొనసాగనుంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహిస్తూ, సామాజిక సమస్యలను పరిష్కరించాలని, ఆర్థిక లావాదే దేవీలు ఎస్సీ (మాల) సామాజిక వర్గ సమావేశం

ప్రధాన పెద్దమనిషిగా పెరుమండ్ల సతీష్ ఏకగ్రీవ ఎన్నిక – రెండేళ్ల పాటు కమిటీ బాధ్యతలు నిర్వహిస్తూ మాల కులాన్ని మరింత ముందుకు తీసుకుపోతానని మాట్లాడాడు

ఎస్సీ (మాల) సామాజిక వర్గ సభ్యుల ప్రత్యేక సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో సామాజిక వర్గ అభివృద్ధి, ఐక్యత, ఎదురవుతున్న సమస్యలు, భవిష్యత్తు కార్యాచరణ తదితర అంశాలపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు.

అనంతరం సామాజిక వర్గ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు వంశపారంపర్యంగా ఉన్న చిన్న కుటుంబాలన్నింటినీ కలుపుకొని మూడు ప్రధాన వర్గాలుగా ఏర్పాటు చేశారు. ప్రతి వర్గానికి ఒకరి చొప్పున ముగ్గురు పెద్దమనుషులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ప్రధాన పెద్దమనిషిగా పెరుమండ్ల సతీష్ (తండ్రి రాజయ్య) సభ్యులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వర్గ పెద్దమనుషులుగా పెరుమండ్ల రఘుపతి (తండ్రి శ్రీహరి), కోండ్ర నరేందర్ (తండ్రి పెద్ద ఉప్పలయ్య), గూడెపు రమేష్ (తండ్రి దుర్గయ్య)లను ఎన్నుకున్నారు.

ఎన్నుకోబడిన కమిటీ పదవీకాలం 2026 నవంబర్ 13 నుంచి 2028 నవంబర్ రెండేళ్ల పాటు కొనసాగనుంది.

ఈ సందర్భంగా ప్రతి నెలా లేదా కనీసం మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించి సామాజిక సమస్యలను సమీక్షించాలని నిర్ణయించారు. కమ్యూనిటీకి సంబంధించిన ఆదాయ, వ్యయాలు, విరాళాల వివరాలను పారదర్శకంగా నమోదు చేసి ప్రతి సమావేశంలో సభ్యులకు తెలియజేయాలని తీర్మానించారు.

అలాగే ప్రతి సభ్యుడి అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తూ, ఎలాంటి పక్షపాతం లేకుండా సమాజ ఐక్యత, అభివృద్ధి కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సమావేశంలో తీర్మానించారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పెద్దమనుషులు సామాజిక వర్గ అభ్యున్నతికి, ఐక్యతకు, సభ్యుల సంక్షేమానికి బాధ్యతాయుతంగా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

సమావేశంలో పాల్గొన్న సభ్యులందరూ నూతన కమిటీ ఎన్నికపై హర్షం వ్యక్తం చేస్తూ, కమిటీకి తమ సహకారం అందిస్తామని తెలిపారు.వీల్లో పారదర్శకత పాటించాలని తీర్మానించారు. సమాజ అభివృద్ధి, ఐక్యత, సభ్యుల సంక్షేమానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని నిర్ణయించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.