*వార్షిక తనిఖీల్లో భాగంగా నార్లాపూర్ పీఎస్ తనిఖీ*
.డీఎస్పీ నలువాల రవీందర్.
*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)*:-
ములుగు జిల్లా, ఎస్ఎస్ తాడ్వాయి మండలం నార్లపూర్ (మేడారం)లో
వార్షిక తనిఖీల్లో భాగంగా ములుగు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రవీందర్ నలువాల నార్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను గురువారం తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులను డీఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు.
పెండింగ్ కేసుల వివరాలు, వాటి పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
స్టేషన్ నిర్వహణ, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ తీరును పరిశీలించారు.
సిబ్బంది విధుల నిర్వహణ, హాజరు, పనితీరుపై సమీక్ష నిర్వహించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీశారు.
శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు.
ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు.
నేర నియంత్రణ, నేరస్తులపై నిఘా మరింత పెంచాలని చెప్పారు.
పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని సిబ్బందికి సూచించారు.
ఈ తనిఖీలో పస్రా సీఐ దయాకర్,
నార్లాపూర్(మేడారం) ఎస్ఐ కమలాకర్,
స్టేషన్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


