📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగౌడ సంఘం నాయకుడు సిద్ధగోని రమేష్ గౌడ్ గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు

గౌడ సంఘం నాయకుడు సిద్ధగోని రమేష్ గౌడ్ గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు

📰 Generate e-Paper Clip

*గౌడ సంఘం నాయకుడు సిద్ధగోని రమేష్ గౌడ్ గృహప్రవేశ వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు*

నూతన దంపతులను శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపిన నాయకులు

రంగారెడ్డి జిల్లా, నవంబర్ 11 (ప్రజావాణి):

మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన గౌడ సంఘం నాయకుడు సిద్ధగోని రమేష్ గౌడ్ నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆరుట్ల గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, బీఆర్ఎస్ పార్టీ మంచాల మండల అధ్యక్షుడు చీర్ల రమేష్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా నూతన గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సిద్ధగోని రమేష్ గౌడ్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దంపతులను శాలువాతో ఘనంగా సన్మానించి, నూతన గృహంలో సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాడుగుల కృష్ణ గౌడ్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు పున్నం రాము, మాడుగుల బాలమణి, పాండాల రవి గౌడ్, చిందం జంగయ్య, కొల్లోజు శంకరాచారి, కాటి కృష్ణ, వెదిరె సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.