📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవిద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించడంలో నిర్లక్ష్యం వద్దు

విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించడంలో నిర్లక్ష్యం వద్దు

📰 Generate e-Paper Clip

*విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించడంలో నిర్లక్ష్యం వద్దు!*

*నీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడాలి.. కలుషితానికి కారణాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా*

నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, నవంబర్ 11:–
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యల పరిష్కారంపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులకు ఎల్లప్పుడూ శుభ్రమైన, నాణ్యమైన తాగునీరు అందుబాటులో ఉండేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) క్యాంపస్‌ను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో నేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్యాంపస్‌లో నీటి సరఫరా పరిస్థితి, తాగునీటి నాణ్యతతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సరఫరా వ్యవస్థను సమగ్రంగా పరిశీలించి, నీరు కలుషితమవుతున్న ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్ సూచించారు. నీటి నమూనాలను ఎప్పటికప్పుడు పరీక్షించి, శుద్ధి చేసిన నీటినే విద్యార్థులకు అందించాలని స్పష్టం చేశారు. కేవలం తాగునీటికే పరిమితం కాకుండా విద్యార్థుల నిత్యావసరాలకు అవసరమైన నీటిని కూడా ఎలాంటి అంతరాయం లేకుండా సరఫరా చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు తమకు ఎదురయ్యే సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి వెంటనే తీసుకురావాలని, వాటి పరిష్కారానికి జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు చేపడుతుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఐఐఐటీ ఉపకులపతి గోవర్ధన్, ఓఎస్డీ మురళి దర్శన్, పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.