📄 ePaper
Epaper 2
Wednesday, November 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవిద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్

విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్

📰 Generate e-Paper Clip

విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్

ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు

ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి, నవంబర్ 11:

భారతదేశ విద్యా రంగానికి బలమైన పునాది వేసి, విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అన్నారు. దేశంలో విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు.

బుధవారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన మైనారిటీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1888 నవంబర్ 11న సౌదీ అరేబియాలోని మక్కాలో జన్మించిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ అసలు పేరు మొహియుద్దీన్ అహ్మద్ అని తెలిపారు. స్వాతంత్ర్య సమరయోధుడిగా, గొప్ప విద్యావేత్తగా, పండితుడిగా, కవిగా ఆయన దేశానికి విశేష సేవలందించారని కొనియాడారు. అరబిక్, ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పెర్షియన్, బెంగాలీ తదితర భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన బహుభాషా కోవిదుడని వివరించారు.

స్వాతంత్ర్యం అనంతరం భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా సుమారు 11 సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించి విద్యా రంగ అభివృద్ధికి అనేక సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. ఐఐటీలు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), సాహిత్య అకాడమీ, సంగీత నాటక అకాడమీ, లలిత కళా అకాడమీ వంటి ప్రముఖ విద్యా, సాంస్కృతిక సంస్థల అభివృద్ధికి ఆయన మార్గదర్శకత్వం వహించారని పేర్కొన్నారు.

14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్య అందించాలని ఆజాద్ ఆకాంక్షించారని, ముఖ్యంగా మహిళా అక్షరాస్యత, సాంకేతిక విద్య అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, అభివృద్ధి సాధ్యమవుతాయని ఆయన విశ్వసించారని తెలిపారు.

ఆయన విద్యా రంగానికి చేసిన సేవలను గుర్తిస్తూ భారత ప్రభుత్వం 2008 నుంచి నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తోందని చెప్పారు. ప్రతి సంవత్సరం పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా సెమినార్లు, వ్యాసరచన పోటీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఆజాద్ ఆశయాలను విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. మైనారిటీల సంక్షేమం, విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి జి. రవికుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి బి. ప్రకాష్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.