📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకే కే కమిటీ కాలయాపన ఇంకెంతకాలం

కే కే కమిటీ కాలయాపన ఇంకెంతకాలం

📰 Generate e-Paper Clip

కే కే కమిటీ కాలయాపన ఇంకెంతకాలం

ఇంకా ఎంత మంది అశువులు బాయాలే.

కమిటీని నిలదీసిన – చంటి భద్రయ్య

ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)

ఉద్యమకారులకు ఇప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం కే కే కమిటీ ఇంకెంత కాలం కాలయాపన చేస్తుందని ఉద్యమ కారుల ఫోరం ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి చంటి భద్రయ్య మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ కమిటీని నిలదీశారు. ఇంకా ఎంతమంది ఉద్యమకారులు అశువులు తీసుకోవాలని ఆవేదన చెందారు . తెలంగాణ స్వరాష్ట్రం కోసం తెగించి పోరాడిన ఉద్యమకారులకు హక్కులు ఆత్మ గౌరవం కావాలని గత తొమ్మిది సంవత్సరాలుగా డా. చీమ శ్రీనివాస్ ఆధ్వర్యం లో వివిధ దశల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నోపోరాటాలు చేస్తే ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టిందని ఆయన తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని విమర్శించారు. కే కే కమిటీ లో ఆరుగురు సభ్యులను నియమించిన బిన్నాభిప్రాయలతో ఎవరికి వారే యమున తీరే అన్న చందంగా కమిటీ నిర్వాకం కొనసాగుతుందని ఆరోపించారు. ప్రభుత్వం ఉద్యమకారులకోసం ఏదో ఒకటి చేస్తుందని ఆశతో వారి కుటుంబాలు ఎదురు చూస్తున్నారని అన్నారు. కే కే కమిటీ కాలయాపన వల్ల విసిగి వేసారి పిట్టల్లాగ రోజుకొక్కరు చొప్పున చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలను సైతం గుర్తించి వారికి కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం అందించాలని , కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు గుర్తింపు కార్డు , 250 గజాల ఇంటి స్థలం తో పాటు ఇందిరమ్మ ఇళ్లు , 25000 పింఛన్ , బస్సు ట్రైన్ పాస్ సౌకర్యం కల్పించి ప్రభుత్వ చిత్తశుద్ధితో హామీలను నిలబెట్టు కోవాలని ఆయన కోరారు. కమిటీ పేరుతో ఇంకా కాలయాపన చేస్తే కమిటీ సభ్యుల ఇంటి ముట్టడి కార్యక్రమం చేపట్టి ,చావుడప్పు కొట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.