ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు : ద్రోణవల్లి సతీష్
బీర్కూర్: దీపావళి పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్ ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకుంటామని తెలిపారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకున్నారు. ప్రజల మధ్య ప్రేమ, ఆప్యాయతలు, ఐక్యత మరింత పెంపొందాలని ఆకాంక్షించారు. పర్యావరణానికి హాని కలగకుండా, చిన్నారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలతో పండుగ జరుపుకోవాలని సూచించారు. బీర్కూర్ మండల ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ద్రోణవల్లి సతీష్
మాజీ జడ్పీటీసీ, బీర్కూర్

