ప్యాక్స్ ఆధ్వర్యంలో మర్మాములలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ముఖ్య అదితిగా కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి
మద్దూరు నవంబర్7, ప్రజా వాణి,
మండలంలోని మర్మాముల గ్రామంలో ఫాక్స్ ఆధ్వర్యంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మర్మాముల గ్రామ సర్పంచ్ సుందరగిరి సత్యనారాయణ గౌడ్ తో కలిసి ఏఎంసి చేర్యాల మార్కెట్ కమిటి చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి,మరియు పాక్స్ చైర్మన్ నాగిళ్ల తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ బోయిని శ్రీనివాస్ చేతుల మీదుగా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ చైర్మన్ బోయిన్ శ్రీనివాస్, పాక్స్ డైరెక్టర్లు ఉట్కూరి మల్లేశం, శ్రీనివాస్ ఫాక్స్ సీఈఓ శ్రీధర్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ రాష్ట్ర యూత్ రాకేష్ కృష్ణన్, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు ఆలేటి విష్ణు, యూత్ అధ్యక్షులు కుస బాను, మాజీ వైస్ ఎంపీపీ పెద్దవుట్ల భూపతిరెడ్డి, మాజీ సర్పంచ్ వెల్ది లక్ష్మీ గోపాల్ రెడ్డి, గ్రామ చత్రపతి యూత్ అధ్యక్షులు యాచరేణి తిరుపతి, హమాలి అధ్యక్ష, కార్యదర్శులు బిక్షపతి , నర్సింలు ఫ్యాక్స్ కేంద్రం ఇన్చార్జిలు ఇండ్ల చంద్రమౌళి, గుర్రం గోవర్ధన్ మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

