గాగిల్లాపూర్ లో మహిళ భవన నిర్మాణాలకు భూమి పూజ
మద్దూరు నవంబర్7, ప్రజా వాణి,
మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం ఆధ్వర్యంలో రెండు మహిళా భవనాలకు భూమి పూజ చేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మాజీ సర్పంచ్ మేక మల్లేశం,సిఏలు యామ రామాంజనేయులు, బొంకూరి బాలమణి, వివో అధ్యక్షురాలు తవిటి సంధ్య, ఏలూరి వెంకటలక్ష్మి, ఫీల్డ్ అసిస్టెంట్, నారదాస్ శ్రీలత సిద్ధులు, అంగన్వాడి టీచర్స్ గుడిసె అరుణ,దాసరి చంద్రకళ,కుల సంఘాల పెద్దమనుషులు, మహిళా గ్రూప్ సభ్యులు, యువజన సంఘాలు, గ్రామపంచాయతీ సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

