జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని గంగదేవిపల్లి గ్రామ శివారులో వాకింగ్‌కు వెళ్లి వ్యవసాయ బావిలో ఈత కొడుతూ రాఘవపట్నం గ్రామానికి చెందిన ఆడెపు మధు (28) ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈత కొట్టే సమయంలో తలకు, మోకాలికి బలంగా గాయాలై, ఊపిరాడక నీట మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తండ్రి భూమయ్య ఫిర్యాదు మేరకు గొల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
