📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎస్బీఐ ఏటీఎంలో హాయిగా నిద్రపోతున్న శునకం

ఎస్బీఐ ఏటీఎంలో హాయిగా నిద్రపోతున్న శునకం

📰 Generate e-Paper Clip

*ఎస్బీఐ ఏటీఎంలో హాయిగా నిద్రపోతున్న శునకం*

*రాయికల్, నవంబర్ 03 (ప్రజావాణి):*

రాయికల్ పట్టణం గాంధీ చౌక్ లోని ఎస్బీఐ ఏటీఎం కేంద్రంలో భద్రత కాస్తా గాలికి వదిలేసినట్లు కనిపిస్తోంది. మంగళవారం ఉదయం ఏటీఎం కేంద్రంలో ఓ శునకం ఏసీ చల్లదనంలో హాయిగా నిద్రపోతూ కనిపించి ఖాతాదారులను ఆశ్చర్యానికి గురిచేసింది.నగదు కోసం వచ్చిన వినియోగదారులు లోపల శునకాన్ని చూసి వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది.దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ ఏటీఎంలోనే సెక్యూరిటీ గార్డు లేకపోవడం,సీసీ కెమెరాలు ఉన్నా పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు దారితీస్తోంది.పగటిపూటే పరిస్థితి ఇలా ఉంటే రాత్రి వేళల్లో మహిళలు, వృద్ధులు ఒంటరిగా ఏటీఎంకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు.శునకాలు కాదు, రాత్రి వేళ అసాంఘిక శక్తులు తిష్ట వేసినా అడిగే నాథుడు లేడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎస్బీఐ ఉన్నతాధికారులు స్పందించి గాంధీ చౌక్ ఏటీఎం కేంద్రంలో శాశ్వతంగా సెక్యూరిటీ గార్డును నియమించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.