📄 ePaper
5pm
7pm
Tuesday, November 17, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణSuryapetవర్షానికి కురుస్తున్న ఇంట్లోనే బతుకు..! ఇందిరమ్మ ఇల్లు కోసం నిరుపేద కుటుంబం ఎదురుచూపులు.

వర్షానికి కురుస్తున్న ఇంట్లోనే బతుకు..! ఇందిరమ్మ ఇల్లు కోసం నిరుపేద కుటుంబం ఎదురుచూపులు.

📰 Generate e-Paper Clip

వర్షానికి కురుస్తున్న ఇంట్లోనే బతుకు..!

ఇందిరమ్మ ఇల్లు కోసం నిరుపేద కుటుంబం ఎదురుచూపులు.

తుఫాన్ వర్షాలతో కూలడానికి సిద్ధంగా ఉన్న ఇల్లు..

కనీసం నిద్రించేందుకు కూడా వీలులేని దుస్థితి!

అధికారులు స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని బాధిత కుటుంబం వేడుకోలు.

హుజూర్నగర్ నవంబర్ 3 (ప్రజావాణి)

సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం కృష్ణాతండ గ్రామపంచాయతీ పరిధిలోని భూక్య లింగయ్య (తండ్రి శంభయ్య) కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు వారి ఇల్లు పూర్తిగా దెబ్బతిని, పైకప్పు రేకుల నుంచి నీరు కారుతుండటంతో కుటుంబ సభ్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఇంటి లోపలికి వర్షపు నీరు చేరడంతో కనీసం రాత్రివేళ నిద్రించేందుకు కూడా స్థలం లేకుండా పోయింది. బట్టలు, బియ్యం, నిత్యావసర వస్తువులు తడిసిపోతున్నాయి. ఇంట్లో మంచాలు వేసుకోవడానికి, ప్రశాంతంగా కూర్చొని భోజనం చేయడానికి కూడా వీలులేని దయనీయ పరిస్థితి నెలకొంది.

తమ పరిస్థితిని ఇప్పటికే పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. అర్హత ఉన్నప్పటికీ తమకు ఇందిరమ్మ ఇల్లు ఎందుకు మంజూరు కావడం లేదని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, మఠంపల్లి తహసీల్దార్, గ్రామపంచాయతీ కార్యదర్శి స్పందించి బాధిత కుటుంబం ఇంటి పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. తక్షణ సహాయక చర్యలు చేపట్టి, అర్హతను పరిశీలించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి నిరుపేద కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.