*నవంబర్ లో 100% హాజరు లక్ష్యంగా కాంప్లెక్స్ సమావేశం*
చిలిపిచెడ్, నవంబర్ 3 (మన ప్రజావాణి)
జెడ్.పి.హెచ్.ఎస్ చిలిపిచెడ్ లో ప్రాథమిక పాఠశాలల కాంప్లెక్స్ సమావేశం ఘనంగా నిర్వహించారు.
ప్రాథమిక పాఠశాలల విద్యా ప్రమాణాలు పెంచడం, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడం ఈ సమావేశ ముఖ్య ఉద్దేశ్యం అని కాంప్లెక్స్ హెచ్.ఎం లు తెలిపారు.
సమావేశంలో చర్చించిన అంశాలు.ఎఫ్.ఎల్.ఎన్ విద్యార్థులలో భాష, గణితంలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించాలి.
విద్యార్థుల హాజరు శాతాన్ని రోజూ పర్యవేక్షించాలి.
మిడ్ లైన్ పరీక్ష ఫలితాలను విశ్లేషించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ప్రశస్త్ యాప్ యాప్ లో వివరాల నమోదు పూర్తి చేయాలి.
అడ్మిషన్లు బడి ఈడు పిల్లలందరినీ ప్రభుత్వ బడిలో చేర్పించాలి.
నవంబర్ లక్ష్యం నవంబర్ నెలలో 100% హాజరు సాధించాలి.
మండల విద్యాధికారి పీ. విట్టల్ ప్రతి విద్యార్థి బడికి రావాలి, ప్రతి విద్యార్థి బాగా నేర్చుకోవాలి, ప్రతి పాఠశాల ఉత్తమ ఫలితాలు సాధించాలి. సమష్టి కృషితో నవంబర్ లో 100% హాజరు లక్ష్యాన్ని సాధిద్దాం” అని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ధనమూర్తి, శ్రీ డి. రమేష్, ఎం.ఆర్.పి లు, సి.ఆర్.పి లు పాల్గొన్నారు.

