*ఎస్‌బీఐ ఆధ్వర్యంలో ఆర్థిక అవగాహన సదస్సు*
*గ్రామస్తులకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన కల్పించిన ఎస్‌బీఐ మేనేజర్*
*ప్రజా వాణి న్యూస్ నవంబర్ 03 సంగారెడ్డి జిల్లా*
మనూర్ మండలం: *ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్* ఆధ్వర్యంలో మరియు EduWise సంస్థ సహకారంతో గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమం (Financial Literacy Awareness Program – FLAP) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలు బ్యాంకుల ద్వారా పొందే ప్రయోజనాలను వివరించారు.
– *పొదుపు ఖాతాలు, జన్ ధన్ యోజన*
– *రుణ సదుపాయాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు*
– *డిజిటల్ లావాదేవీలు – UPI, Google Pay, PhonePe వాడకంలో జాగ్రత్తలు*
– *సైబర్ మోసాల పట్ల అప్రమత్తత – OTP ఎవరికీ చెప్పవద్దు*
– *ప్రభుత్వ పథకాలు – పీఎం బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన*
వంటి అంశాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అనవసరంగా ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు చేయకుండా బ్యాంకులను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువత పాల్గొన్నారు.

