📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణగూడూరులో కోతుల బీభత్సం దాడి

గూడూరులో కోతుల బీభత్సం దాడి

📰 Generate e-Paper Clip

*గూడూరులో కోతుల బీభత్సం దాడి…*

*క్షణం క్షణం భయం భయం..?, రోడ్లపై ఒంటరిగా వెళ్లాలంటేనే అదో నరకం..?*

*ఒకరికి గాయాలు…*

గూడూరు మండల ప్రతినిధి:- నవంబర్ 02. (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, స్థానిక మండల కేంద్రంలో ఉన్న ఎస్సీ కాలనీలో తెల్లవారుతుండగానే కోతులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒకేసారి గుంపులు గుంపులుగా గూడూరు ఎస్సీ కాలనీలోకి చొరబడి, కాలనీ వాసులపై దాడి చేస్తూ.. ఇంటిపై ఉన్న పిట్టగోడల మీదకి చేరి అరుపులు కేకల ఘీంకారములతో గోడలను కూల్చి వేస్తూ.. సిమెంట్ రేకులను సైతం పగలగొట్టి, ఇంటిలోనికి చొరబడుతూ… కాలనీవాసులను కలవర పెడుతున్నాయి. అందులో భాగంగానే కాలనీ ఓ ఇంటి యజమాని పొలపాక యాకయ్య పై దాడి చేసి గాయపరిచాయి. చేయి పూర్తిగా ఫ్రాక్చరై భీభత్సమైన రక్తస్రావం అయింది. ఎన్నిసార్లు కోతులను తరిమికొట్టిన కూడా గ్రామస్తుల పైకి దాడికి యత్నిస్తున్నాయే తప్ప? కాలనీ మాత్రం వదిలి వెళ్ళటం లేదు. అంతేకాకుండా చిన్నపిల్లలు, యువతీ, యువకులపై దాడికి పునుకుంటూ… విచ్చలవిడిగా గ్రామస్తులను అల్లకల్లోలానికి గురి చేస్తున్నాయి. దీనితో పాదచారులు ఒంటరిగా రహదారులపై నడిచి బయటకివెళ్లి సొంత పనులకు చేయడానికి బయలుదేరాలంటేనే వెన్నులో వణుకు పుట్టుతుందని ఎస్సీ కాలనీ వాసులు భయభ్రాంతులతో తమ ఆవేదనలను వ్యక్తం చేస్తున్నారు. దీనిపై గ్రామ పరిపాలనాధికారులు, గూడూరు మండల ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే శాశ్వతమైన పరిష్కారం దిశగా అడుగులు వేయాలని కాలనీవాసులు వేడుకుంటున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.