📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పనిచేయాలి

కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పనిచేయాలి

📰 Generate e-Paper Clip

*కేసుల్లో కన్విక్షన్ శాతం పెంచేలా సమర్థవంతంగా పనిచేయాలి – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్..*

*కోర్టు డ్యూటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ..*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

కోర్టుల్లో కేసుల విచారణలో నిందితులకు శిక్షలు పడే కన్విక్షన్ శాతాన్ని మరింత పెంచే దిశగా కోర్టు డ్యూటీ అధికారులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేయాలని నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ సూచించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్టు డ్యూటీ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కేసుల విచారణలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రతి కేసులో నేర నిరూపణ జరిగేలా సంబంధిత అధికారుల మధ్య సమన్వయం ఉండాలని తెలిపారు. ప్రతి కేసులో దర్యాప్తు సమయంలో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు, ఇతర కీలక పత్రాలను కోర్టులో సమర్పించే విషయంలో ఎలాంటి లోపాలు లేకుండా దర్యాప్తు అధికారులతో కోర్టు డ్యూటీ అధికారులు నిరంతరం సమన్వయం చేసుకోవాలని తెలిపారు. కేసుల విచారణలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని సూచించారు. కోర్టుల నుంచి జారీ అయ్యే సమన్లు, వారెంట్ల అమలులో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సాక్షులు నిర్ణీత సమయానికి కోర్టుకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమన్లు అందజేయడంలో లేదా సాక్షుల హాజరులో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రతి కేసు విచారణ పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, తదుపరి విచారణ తేదీలు, కోర్టు ఆదేశాలు, కేసుల ప్రస్తుత పరిస్థితిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అదేవిధంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని, కేసుల విచారణకు ముందుగానే సంబంధిత కేసు వివరాలు, సాక్ష్యాధారాలు, సాక్షుల వివరాలను వారికి అందుబాటులో ఉంచాలని తెలిపారు. విచారణ సమయంలో ప్రాసిక్యూషన్ తరఫున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు సమన్వయం చేసుకోవాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సూచించే అంశాలను సంబంధిత దర్యాప్తు అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేలా చూడాలని ఆదేశించారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు, పోక్సో కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎస్పీ సూచించారు. ఈ కేసుల విచారణలో సాక్షుల హాజరు, సాక్ష్యాధారాల సమర్పణ, కోర్టు ప్రక్రియలను నిరంతరం పర్యవేక్షించాలని, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయం చేసుకుంటూ నిందితులకు చట్టప్రకారం శిక్షలు పడేలా కృషి చేయాలని తెలిపారు. కేసుల్లో కన్విక్షన్ శాతం పెంపునకు ప్రతి కోర్టు డ్యూటీ అధికారి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని, కేసుల విచారణలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి పరిష్కరించడంలో చొరవ చూపాలని అన్నారు. కోర్టుల్లో నిందితులకు శిక్షలు పడేలా సమర్థవంతమైన సమన్వయం చేసి, కన్విక్షన్ శాతం పెంపులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పి రమేష్, సీఐలు శ్రీను నాయక్, బీషన్న, సంబంధిత పోలీస్ అధికారులు, కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.