ఎన్ హెచ్ ఎం నిరవధిక దీక్ష 19వ రోజుకు చేరుకుంది
ప్రజావాణి అక్టోబర్ 31 ఎన్ హెచ్ ఎం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరవధిక దీక్ష నేటికి 19వ రోజుకు చేరుకుంది సమాన పనికి సమాన వేతనం ఉద్యోగ భద్రత క్రమబద్ధీకరణ డిమాండ్లతో వందనాది మంది ఎన్ని హెచ్ఎం ఉద్యోగులు రోడ్డు మీదే బైఠాయించారు
ఈరోజు జరిగిన దీక్ష సేబిరానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర జనరల్ సెక్రెటరీ రుక్ముద్దీన్ రాష్ట్ర కోశాధికారి నరేష్ మాదిగ హక్కుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మైస ఉపేందర్ హాజరై సంఘీభావం తెలిపారు
ఈ సందర్భంగా
మాట్లాడుతూ రుక్మద్దీన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ
కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి సేవ చేసిన ఎన్ హెచ్ ఎం ఉద్యోగులను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణం 19 రోజులుగా రోడ్డు మీద ఉన్న ప్రభుత్వం స్పందించలేకపోవడం సిగ్గుచేటు డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం ఆగదు
సమాన పనికి సమాన వేతన ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ మరియు 10 లక్షల ప్రమాద బీమా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు
ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల పోరాటం న్యాయమైనది అణగారిన వర్గాల నుండి వచ్చిన ఎంతోమంది ఉద్యోగులు ఈ ఉద్యమంలో ఉన్నారు వారి న్యాయమైన డిమాండ్లకు మాదిగ హక్కుల పరిరక్షణ సమితి పూర్తి మద్దతు తెలుపుతుంది ప్రభుత్వం వెంటనే చర్చలకు పిలిచి సమస్య పరిష్కరించాలి లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తాం అని హెచ్చరించారు
అనంతరం దీక్ష శిబిరంలో మహిళా ఉద్యోగులు చప్పట్లతో నినాదాలతో తమ నిరసన వ్యక్తం చేశారు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు
ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం జాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుక్ముద్దీన్ రాష్ట్ర కోశాధికారి నరేష్ మొగిలి చంద్రమౌళి మల్లేశం స్పందన ప్రశాంత్ సురేందర్ సరిత రాజేష్ జ్యోతి లావణ్య నర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ ఏఎన్ఎంలు మరియు జేఏసీ నాయకులు నిరసన తెలియజేశారు

