కానుకుంట గ్రామానికి చెందిన పలువురు బీజేపీలో చేరిక
నర్సాపూర్, అక్టోబర్ 29: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంట గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు గురువారం నర్సాపూర్‌లో బీజేపీలో చేరారు. సంగారెడ్డి జిల్లా బీజేపీ కౌన్సిల్ సభ్యులు పలుగు గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మురళీధర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ శ్రీకాంత్, నాగులు, రత్నం, నరేష్, కుమార్, లక్ష్మణ్, రాజు, రాము, జావిద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

