చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి మృతి
మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్
మద్దూరు అక్టోబర్28, ప్రజా వాణి,
ఈ నెల 20.10.2026న దసరా పండుగ సందర్భంగా వల్లంపట్ల గ్రామంలోని నూతన ఇంటి వద్ద సుమారు 70–80 సంవత్సరాల వయస్సుగల గుర్తుతెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గజ్జల మహేందర్ గమనించి, వెంటనే 108 అంబులెన్స్ ద్వారా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా,చికిత్స పొందుతూ 27.10.2026న మధ్యాహ్నం 2:36 గంటలకు మృతి చెందాడు.ఈ ఘటనపై అందిన పిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పై వ్యక్తికి చెందిన ఎలాంటి వివరాలు తెలిసిన మద్దూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ – 8712667357, 8712667474 లకు తెలియజేయాలని మద్దూరు ఎస్సై మహమ్మద్ ఆసీఫ్ ఒక ప్రకటనలో విలేఖర్లకు తెలిపారు.

