📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహణ

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహణ

📰 Generate e-Paper Clip

*పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహణ – జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా దేశం కోసం, ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల సేవలను స్మరించుకుంటూ మంగళవారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా ఈ సంవత్సరం 154 మంది, మన తెలంగాణ లో నలుగురు పోలీసులు అమరులయ్యారని వారి త్యాగాలు చిరస్మరణీయమని, ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లు, ప్రమాదాలను ఎదుర్కొంటూ ప్రజల భద్రతే లక్ష్యంగా పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది సేవలు అభినందనీయమని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, వారి ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే వారికి అర్పించే నిజమైన నివాళి అని అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియజేయడం, పోలీసుల సేవలు, విధి నిర్వహణలో వారు ఎదుర్కొనే సవాళ్లపై ప్రజల్లో అవగాహన కల్పించడం అని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ చట్టాలను గౌరవించాలని, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ పట్టణంలోని ఎన్. జి కళాశాల, రామగిరి, క్లాక్ టవర్ మీదుగా కొనసాగింది. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, వారి సేవలను ప్రజలకు తెలియజేస్తూ నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా పోలీస్ శాఖ ప్రజలకు శాంతి, భద్రతల పరిరక్షణపై అవగాహన కల్పించింది. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అమరవీరుల త్యాగాలను ప్రజలకు చేరువ చేస్తున్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల సేవలను స్మరించుకోవడం, వారి కుటుంబాల త్యాగాలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పోలీస్ శాఖ పేర్కొంది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పి రమేష్,12th BN అడిషనల్ కమెండెంట్ నాగేశ్వరావు, నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాసులు,సీఐలు, ఆర్.ఐలు, ఎస్.ఐలు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.