📄 ePaper
Epaper 2
Tuesday, October 27, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణభవనాల బ్లూ ప్రింట్ మ్యాప్ లు"వేం"పరిశీలన

భవనాల బ్లూ ప్రింట్ మ్యాప్ లు”వేం”పరిశీలన

📰 Generate e-Paper Clip

భవనాల బ్లూ ప్రింట్ మ్యాప్ లు”వేం”పరిశీలన..

ఏ టి సి తహసిల్దార్ ఆఫీస్ ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయాలి..
రాజ్యసభ సభ్యులు నరేందర్ రెడ్డి

ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో అధునాతన సాంకేతిక/వృత్తి విద్యా శిక్షణా కేంద్రం(ఏ టి సి), తహసిల్దార్, పోలీస్ స్టేషన్ భవనాల స్థలాలకు సంబంధించిన కార్యాలయాల నిర్మాణ బ్లూప్రింట్, లేఅవుట్ మ్యాప్‌లను రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి మంగళవారం ఇనుగుర్తి తాసిల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మురళి నాయక్,ఎంపి పోరిక బలరాం నాయక్,జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ లతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు.

సేవలు త్వరగా అందుబాటులోకి తేవాలి..

నూతనంగా ఆవిర్భవించిన ఇనుగుర్తి మండలంలో ప్రజలకు పరిపాలన, శాంతిభద్రతల సేవలు మరింత సులభంగా అందేలా అధునాతన సాంకేతిక/వృత్తి విద్యా శిక్షణా కేంద్రం(ఏ టి సి), ఎమ్మార్వో (తహసీల్దార్) కార్యాలయం, పోలీస్ స్టేషన్ శాశ్వత భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇనుగుర్తి నుండి నెల్లికుదురు దారిలో కేటాయించిన భూమి వివరాలను, స్థలాన్ని, పనులను పరిశీలించారు.
రెవెన్యూ అధికారులతో మాట్లాడి భూమి విస్తీర్ణం, సర్వే నంబర్లు, సరిహద్దుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్, గాయత్రి గ్రూప్ ఆఫ్ సంస్థల అధినేత,బిఆర్ఎస్ రాష్ట్ర నేత వద్దిరాజు కిషన్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్,ఆర్.డి.ఓ రాజేశ్వరి,తహసిల్దార్ శ్రీనివాసులు,ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.