📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణలొద్దికుంట చెరువు శిఖం భూమి ఆక్రమణపై సమగ్ర విచారణ జరిపించాలి

లొద్దికుంట చెరువు శిఖం భూమి ఆక్రమణపై సమగ్ర విచారణ జరిపించాలి

📰 Generate e-Paper Clip

*లొద్దికుంట చెరువు శిఖం భూమి ఆక్రమణపై సమగ్ర విచారణ జరిపించాలి*

* *మన ప్రజావాణి* *మందమర్రి*:-

మండలంలోని మామిడిగట్టు గ్రామంలోని లొద్దికుంట చెరువు శిఖం భూమి ఆక్రమణపై సమగ్ర విచారణ జరిపించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టిజేఎస్ జిల్లా అధ్యక్షుడు బచ్చలి ప్రవీణ్ కుమార్, బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ లు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం మండల కేంద్రంలోని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మండల తహశీల్దార్ పి సతీష్ కుమార్, మండల ఎంపిడిఓ ఎన్ రాజేశ్వర్ కు ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ, మామిడిగట్టు గ్రామ పరిధిలోని లొద్ది కుంట చెరువు శిఖం భూమిలో సుమారు 10 ఎకరాలను ఒక మాజీ సర్పంచ్ ఆక్రమించి, మామిడి తోటను సాగు చేస్తున్నారని ఆరోపించారు. ఆ భూమికి పట్టా సైతం పొందినట్లు సమాచారం ఉందని తెలిపారు. చెరువు శిఖం భూములు ప్రజా ఉపయోగం, నీటి నిల్వ సామర్థ్యం కోసం చాలా కీలకమని, వాటిని ఆక్రమించడం వల్ల గ్రామ ప్రజలకు, రైతులకు నీటి కొరత వస్తుందన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్, నీటిపారుదల శాఖ అధికారులతో క్షేత్రస్థాయి విచారణ చేసి, భూ రికార్డులు, పట్టా వివరాలు పరిశీలించాలని కోరారు. ఆ భూమి నిజంగా చెరువు శిఖం భూమిగా తేలితే, ఆక్రమణలను తొలగించి, భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఆక్రమణలు జరగకుండా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఫిర్యాదుపై చేసిన విచారణ, తీసుకున్న చర్యల వివరాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.