జాతీయ రహదారిపై పత్తి చేలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ఇద్దరికి స్వల్ప గాయాలు.. తృటిలో తప్పిన ప్రమాదం
కూసుమంచి, ప్రజావాణి:
జాతీయ రహదారిపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పత్తి చేలోకి దూసుకెళ్లిన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లింగారంతండా సమీపంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు లింగారంతండా సమీపానికి చేరుకోగానే అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న పత్తి చేలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. బస్సులో ప్రయాణికులు తక్కువ సంఖ్యలో ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.
అయితే, బస్సు అదుపుతప్పడానికి అతివేగమే కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. జాతీయ రహదారులపై వాహనాలు నడిపే డ్రైవర్లు వేగ నియంత్రణ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది.

