*ముదిరాజ్ సింహ గర్జన సభ విజయవంతం*
*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*
అక్టోబర్ 25
తెలంగాణ ముదిరాజ్ మహాసభ మంచిర్యాల జిల్లా వేంపల్లిలోని పద్మావతి గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన ముదిరాజ్ సింహ గర్జన సభ ఘనంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ముదిరాజ్ కుల బంధువులు, యువత, సంఘం నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ మహాసభ జిల్లా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.సభలో ముదిరాజ్ సామాజిక వర్గం అభివృద్ధి, ఐక్యత, హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యం, యువతకు అవకాశాలు తదితర అంశాలపై నాయకులు మాట్లాడారు. సమాజ అభ్యున్నతికి కుల బంధువులంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముదిరాజ్‌ల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు.కార్యక్రమానికి తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బండ ప్రకాశ్ ముదిరాజ్, శాసనమండలి డిప్యూటీ చైర్మన్, మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లబోయిన అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్ల సత్తయ్య, బొజ్జ నారాయణ తదితరులు హాజరయ్యారు.మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గరిగంటి కొమురయ్య, ముదిరాజ్ యువత జిల్లా అధ్యక్షుడు గరిగే సుమన్, రాష్ట్ర యువత అధ్యక్షుడు పండగ బాలు, రాష్ట్ర నాయకులు మర్రి ప్రభాకర్, గుమ్ముల స్వామి, బొల్ల వెంకట్, రాధాకృష్ణ, నూకం వెంకటేశ్, రావుల ఉప్పలయ్య, ముల్కంపల్లి వెంకటేశ్వర్లు, తండబోయిన శ్రీకాంత్, కంకణాల సతీష్ తదితరులు పాల్గొన్నారు.అలాగే వివిధ జిల్లాల నుంచి వచ్చిన ముదిరాజ్ మహాసభ ప్రతినిధులు, నాయకులు, మహిళా ప్రతినిధులు, యువత, కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు. కార్యక్రమాన్ని సమన్వయంతో నిర్వహించిన జిల్లా నాయకత్వానికి పలువురు అభినందనలు తెలిపారు..

