📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణస్వర్గీయ అనిత బాయి పాండురంగ్ పటేల్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా హెల్త్ క్యాంప్

స్వర్గీయ అనిత బాయి పాండురంగ్ పటేల్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా హెల్త్ క్యాంప్

📰 Generate e-Paper Clip

స్వర్గీయ అనిత బాయి పాండురంగ్ పటేల్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు…

హెల్త్ క్యాంప్ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీౠ యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్..

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి..

కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని దోస్పల్లి గ్రామంలో ఆదివారం రోజున స్వర్గీయ అనిత బాయి పాండురంగ్ పటేల్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగిందని యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్ అన్నారు.. ఈ హెల్త్ క్యాంప్లో యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్ పాల్గొని హెల్త్ సెంటర్ పరీక్షలను నిర్వహించుకున్నారు.. ఈ సందర్భంగా యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్ మాట్లాడుతూ…. ఈ ఉచిత వైద్య శిబిరం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు, ఈ శిబిరంలో వైద్యులు డాక్టర్లు మాధవ్ గ్రామస్తులు రక్తపోటు, బిపి, మధుమేహం, షుగర్, జలుబు, వంటి సాధారణ ఆరోగ్య సమస్యలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం రొగులకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు.. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ…. గ్రామీణులు తమ ఆరోగ్య పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఈ ఉచిత వైద్య సేవలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారుతి తోపాటు కాంగ్రెస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు సతీష్ పటేల్, మాజీ ఎంపీపీ భర్త నీళ్లు పటేల్, జుట్టు మాజీ సర్పంచ్ రాములు సెట్, జై రామ్ రెడ్డి, బాలాజీ పటేల్, ‌ బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఆయిల్ మారుతి, రెబల్ సాయినాథ్, రాజు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.