📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపల్లా చొరవతో మాతా శిశు ఆస్పత్రి రహదారికి త్వరలో మరమ్మతులు

పల్లా చొరవతో మాతా శిశు ఆస్పత్రి రహదారికి త్వరలో మరమ్మతులు

📰 Generate e-Paper Clip

పల్లా చొరవతో మాతా శిశు ఆస్పత్రి రహదారికి త్వరలో మరమ్మతులు!

జాతీయ రహదారుల శాఖ డిఈ తో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ

15 రోజుల్లో బీటీ రోడ్డు వేస్తామని డిఈ హామీ

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 25(ప్రజావాణి):జనగామ జిల్లా కేంద్రంలోని చంపక్ హిల్స్ సమీపంలో ఉన్న మాతా శిశు సంక్షేమ ఆస్పత్రికి వెళ్లే జాతీయ రహదారి పూర్తిగా దెబ్బతినడంతో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలువురు ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వయంగా రహదారి పరిస్థితిని పరిశీలించారు.

ఆస్పత్రికి వచ్చే గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, ఇతర రోగులు దెబ్బతిన్న రహదారి కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన ఎమ్మెల్యే, ఆదివారం జాతీయ రహదారుల శాఖ డిఈ తో ఫోన్‌లో మాట్లాడారు. రోగులు, గర్భిణులకు ఇబ్బందులు కలగకుండా రహదారికి త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని సూచించారు.

దీనిపై స్పందించిన డిఈ , వారం రోజుల్లో రహదారి మరమ్మతు పనులు ప్రారంభించి, 15 రోజుల్లో బీటీ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చారు. ఆస్పత్రికి వచ్చే ప్రజలకు రాకపోకల్లో ఇబ్బందులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.