📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి

పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి

📰 Generate e-Paper Clip

పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలి…

బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఇదురు అయిలయ్య
పెద్దవంగర అక్టోబర్ 24 ప్రజావాణి
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ రానున్న ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరు జాబితాలో తమ పేరును నమోదు చేసుకోవాలని నాయకులు సూచించారు .పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండటం ద్వారా తమ అభిప్రాయాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు. డిగ్రీ పూర్తి చేసిన యువత, ఇతర పట్టభద్రులు ఓటరు నమోదుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నిర్ణీత నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలిపి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. యువతతో పాటు పట్టభద్రులందరూ ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధానకార్యదర్శి శ్రీరాం సంజయ్,గ్రామ పార్టీ అధ్యక్షుడు రెడ్డబోయిన గంగాధర్,మాజీ ఎంపీటీసీ పాసులేటి వెంకటరామయ్య,మాజీ సర్పంచ్ దంతాలపల్లి సాయిలు,మండల పార్టీ యూత్ ఉపాధ్యక్షుడు కూకట్ల యాకన్న,పొడిశెట్టి సమ్మయ్య, ఆర్కే తండా సర్పంచ్ బానోతు యమునా రాకేష్,మాజీ ఉప సర్పంచ్ గిరగని ఐలయ్య,పట్టభద్రులు గిరగని రవి,మండల పార్టీ సోషల్ మీడియా అధ్యక్షుడు ఎర్రసాని రాంమూర్తి,గంగారపు మధు, బానోతు రాజకుమార్,బానోతు విక్రమ్, జాటోతు వెంకన్న, గిరగాని భారత్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.