*స్వర్ణగిరిలో ఘనంగా మూడో రోజు పవిత్రోత్సవాలు…*
*పవిత్రోత్సవాలలో చతుర స్థానార్చన అగ్ని ప్రతిష్ట.*
*కల్పవృక్ష వాహనంపై దర్శన మిచ్చిన స్వర్ణగీరీషుడు.*
*చంద ప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు.*
*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 24*
తెలంగాణ రాష్ట్రంలోని ప్రాముఖ్య వైష్ణవ పుణ్య క్షేత్రముగా విరాజిల్లుతున్న యాదాద్రి తిరుమల దేవ స్థానం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ స్థానంలో శనివారం మూడో రోజు ఘనంగా ప్రారంభమైన పవిహ త్రోత్సవాలు..పవిత్రోత్సవాల మూడో రోజు శనివారం ఉదయం చతుస్థానార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాశ్వతకంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలోని లక్ష్మీ మండపంలో ఏర్పాటు చేసిన జాగష్టాలలో అగ్ని ప్రతిష్ట కార్యక్రమాన్ని వేద మంత్రోచ్ఛారణల నడుమ ఘనంగా నిర్వహించారు. వైదిక క్రతువులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతా వరణముతో నిండిపోయింది. పవిత్రోత్సవాల్లో భక్తులు పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య అనుగ్రహాన్ని పొందారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మానేపల్లి రామారావు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. మూడవ రోజు సందర్భంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కల్పవృక్ష వాహనం పై కొలువు దీరి భక్తులకు దివ్య మంగళ రూపాన్ని దర్శన మిచ్చారు. కల్పవృక్ష వాహన సేవలో స్వామి వారిని దర్శించుకున్న భక్తులు గోవింద నామ స్మరణతో మానేపల్లి హిల్స్ స్వర్ణగిరి క్షేత్రాన్ని మార్మోగించారు. కల్పవృక్ష వాహనం పై విరాజిల్లిన శ్రీవారి దివ్య రూపం భక్తులకు కనుల పండువగా నిలిచి పొయింది. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చంద్ర ప్రభ వాహనం పైన ఆలయ మాడవీధులలో తిరుగుతూ భక్తులకు స్వామివారి దివ్య స్వ రూపాన్ని ప్రసాదించారు. స్వామి వారి దివ్య మంగళ స్వరూపాన్ని చూసి భక్తులు ఆనంద పరవశులయినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

