📄 ePaper
Epaper 2
Monday, October 26, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణధాన్యం అక్రమ రవాణా నివారణకు ప్రత్యేక తనిఖీ కేంద్రం

ధాన్యం అక్రమ రవాణా నివారణకు ప్రత్యేక తనిఖీ కేంద్రం

📰 Generate e-Paper Clip

ధాన్యం అక్రమ రవాణా నివారణకు ప్రత్యేక తనిఖీ కేంద్రం

మహాదేవపూర్ / కాలేశ్వరం, మన ప్రజావాణి : ధాన్యం అక్రమ రవాణాను అరికట్టడంతో పాటు రైతులకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర అందేలా చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక తనిఖీ కేంద్రాన్ని శనివారం ఆయన వివిధ శాఖల అధికారులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యాన్ని అక్రమంగా తెలంగాణలోకి తరలించకుండా నిరోధించేందుకు ప్రత్యేక తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలకు తావులేకుండా, రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోందన్నారు.కాళేశ్వరం అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద పోలీస్, పౌర సరఫరాల శాఖ అధికారులు సమన్వయంతో 24 గంటల పాటు నిరంతర తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సరిహద్దు దాటి వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని, తనిఖీల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.రైతుల సంక్షేమం, వారు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా సంబంధిత శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, డీఎం రాములు, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.