📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఈనెల 26న మద్దూరులో అండర్-19 హ్యాండ్‌బాల్ ఎస్‌జీఎఫ్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్

ఈనెల 26న మద్దూరులో అండర్-19 హ్యాండ్‌బాల్ ఎస్‌జీఎఫ్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్

📰 Generate e-Paper Clip

ఈనెల 26న మద్దూరులో అండర్-19 హ్యాండ్‌బాల్ ఎస్‌జీఎఫ్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్

మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కోట నరేందర్ రెడ్డి

మద్దూరు అక్టోబర్24, ప్రజా వాణి,

ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి అండర్-19 హ్యాండ్‌బాల్ ఎస్‌జీఎఫ్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్ ఈనెల 26వ తేదీ సోమవారం మద్దూరు మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కోట నరేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ పోటీల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట జిల్లాలకు చెందిన బాలబాలికలు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు అక్టోబర్ 26వ తేదీ ఉదయం 9:30 గంటలకు మద్దూరులోని పీఎం శ్రీ మోడల్ స్కూల్‌లో రిపోర్ట్ చేయాలని సూచించారు. క్రీడాకారులు తప్పనిసరిగా తమ బోనఫైడ్ సర్టిఫికెట్, పదో తరగతి మెమోలను వెంట తీసుకురావాలని తెలిపారు.
ఈ ఎంపిక పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లా తరఫున రాష్ట్రస్థాయిలో ప్రాతినిధ్యం వహించేందుకు 16 మంది బాలికలు,16 మంది బాలురు, మొత్తం 32 మంది క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు వివరించారు.
ఈ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్‌కు నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్న పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ దామెర ప్రేమ్ కుమార్‌ను మరిన్ని వివరాల కోసం 9000997100 నంబర్‌లో సంప్రదించాలని ప్రిన్సిపాల్ కోట నరేందర్ రెడ్డి కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.