ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
కాంగ్రెస్ మండల అధ్యక్షులు అశోక్ గౌడ్
ప్రజావాణి,ఇనుగుర్తి:ప్రజా సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బైరు అశోక్ గౌడ్ అన్నారు. ఇనుగుర్తి మండలం చిన్ననాగారం గ్రామానికి చెందిన కౌటం ఎల్లమ్మ సుధాకర్ దంపతుల కుటుంబ సభ్యులకు మంజూరైన రూ.60వేల సీఎం ఆర్ ఎఫ్ చెక్కును స్థానిక సర్పంచి చెడుపాక సుజాత యాక్కయ్య,వార్డు సభ్యులతో కలిసి అశోక్ గౌడ్ ఎల్లమ్మకు శనివారం స్థానిక గ్రామపంచాయతీ ఆవరణంలో అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య బాధితులకు ప్రభుత్వం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీఎం రిలీఫ్ ఫండ్ ను అందజేస్తుందన్నారు.కార్యక్రమంలో వార్డు సభ్యులు బైరు వెంకన్న గౌడ్, ఎలుగలబోయిన శ్రీనివాస్ యాదవ్,నిడిగంటి చంద్రమౌళి, ముత్యాల సోమక్క వెంకన్న ,మునిగంటి సరిత రాజు,చెడుపాక అలివేలు వెంకన్న,గుండాల మంగమ్మ ధర్మయ్య, నాయకులు గుండాల దుర్గ స్వామి తదితరులు పాల్గొన్నారు.

