📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి

📰 Generate e-Paper Clip

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి.
ములుగు జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు.

ఏటూరునాగారం అక్టోబరు 24 ప్రజావాణి:

ఈరోజు మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ఏటూర్ నాగారం తహసీల్దార్ కార్యాలయంలో ఏటూర్ నాగారం మండలం లోని పలు గ్రామాలలో తహసిల్దార్ గుర్రం జగదీష్ ఆధ్వర్యంలో ఐదుగురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి ములుగు జిల్లా ఆత్మ కమిటీ చైర్మన్ చిటమట రఘు
బ్లాక్ ఆత్మ కమిటీ చైర్మన్ కర్ల అరుణ చేతుల మీదుగా కల్యాణ లక్ష్మి చెక్కులు అందించడం జరిగింది.

1. అజ్మీర రజిత (దొడ్ల)
2. అందె నాగమ్మ (కొండాయి)
3. డబ్బా కట్ల జ్యోతి (కొండాయి)
4. మండపు సరస్వతి (రోహిర్)
5. దెబ్బ కట్ల అరుణ (మల్యాల)
అందించడం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ నిరుపేదలకు అండదండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులు మరి ఏ ప్రభుత్వం చేపట్టలేదని మంత్రి సీతక్క చొరవ తో ములుగు జిల్లాలో అనేక గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టారని అన్నారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కళ్యాణ లక్ష్మి చెక్కులు, షాదీ ముబారక్ అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ రాజేష్, ఆర్ ఐ కిరణ్ కుమార్ జిపిఓలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.