📄 ePaper
Epaper 2
Sunday, October 25, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణక్రీడా ప్రతిభకు ప్రోత్సాహం.. యువతకు భరోసా

క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం.. యువతకు భరోసా

📰 Generate e-Paper Clip

క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం.. యువతకు భరోసా!

బెక్కెం నారాయణరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్

విజేతలకు నగదు బహుమతుల ప్రదానం.. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం

చిన్నంబావి, ప్రజావాణి: అక్టోబర్ 22

గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా బెక్కెం నారాయణరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో నాలుగు జట్లు పాల్గొని తమ ప్రతిభనుచాటుకున్నాయి. పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు ట్రస్ట్ తరఫున నగదు బహుమతులు అందజేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యుడు జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు.

విజేతలకు నగదు బహుమతులు

బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రథమబహుమతిగా రూ.5,000, ద్వితీయ బహుమతిగా రూ.4,000
అందజేశారు.

ప్రథమ బహుమతి విజేతలు:తిరుమలేష్, కామిరెడ్డి శేఖర్, టి. నాని, తక్కశిల వినోద్, ఎస్. మహేష్.ద్వితీయ బహుమతి విజేతలు: కామిరెడ్డి నాయుడు, కామిరెడ్డి ఉమేష్, డి. శివగౌడ్, టి. చిన్నరాయుడు, శివ.విజేతలకు నగదుబహుమతులు అందజేయడం ద్వారా క్రీడాకారుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. గ్రామీణ యువతకు సరైన అవకాశాలు, ప్రోత్సాహం కల్పిస్తే క్రీడా రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

క్రీడలతో శారీరక దృఢత్వం.. మానసిక ఉల్లాసం

నేటి ఆధునిక జీవనశైలిలో క్రీడలు ప్రతి ఒక్కరి జీవితంలో కీలక పాత్రపోషిస్తున్నాయి. ముఖ్యంగా యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయి. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, ఏకాగ్రత, ఓటమిని స్వీకరించే మనస్తత్వం, విజయాన్ని సాధించాలనే తపన వంటి విలువలను క్రీడలుఅవలంబించాలి అని అన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.