శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం
ఎస్సై పి.నరేష్
ప్రజావాణి,ఇనుగుర్తి:శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఇనుగుర్తి ఎస్సై పి.నరేష్ హెచ్చరించారు. మండల కేంద్రానికి చెందిన గుజ్జునూరి వినోద్ మండల కేంద్రం ఇనుగుర్తి గ్రామంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ, చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించిన నేపథ్యంలో వినోద్ ను అరెస్టు చేసినట్లు తెలిపారు. అనంతరం మహబూబాబాద్ కోర్టులో హాజరుపరిచి, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు. గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

